రేపు గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని సందర్శించనున్న సీఎం జగన్
- సచ్చిదానంద ఆశ్రమంలో సీఎం జగన్ పర్యటన
- ఆశ్రమంలోని ఆలయాన్ని దర్శించనున్న సీఎం
- అనంతరం సచ్చిదానంద స్వామితో సమావేశం
- ఆశ్రమంలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు
ఈ పర్యటన కోసం సీఎం జగన్ రేపు ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరతారు. 10.30 ఆశ్రమానికి చేరుకుని 20 నిమిషాల పాటు ఆశ్రమంలోని ఆలయాన్ని దర్శిస్తారు. అనంతరం సచ్చిదానంద స్వామితో సమావేశమవుతారు. ఈ భేటీ 11.30 గంటల వరకు సాగనుంది. అనంతరం సీఎం జగన్ తన నివాసానికి తిరుగు పయనమవుతారు.