ఈ విధంగా ఆడితేనే ఇండియాపై గెలుస్తాం: పాక్ దిగ్గజం జావెద్ మియాందాద్
- ఒత్తిడి, భయం లేకుండా ఆడితేనే విజయం దక్కుతుంది
- టీ20 అంటే కేవలం సిక్సులు, ఫోర్లు బాదడం కాదు
- జట్టు మొత్తం బాబర్ పై ఆధారపడకూడదు
మరోవైపు భారత్ తో జరిగే మ్యాచ్ లపై పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన జావెద్ మియాందాద్ స్పందించారు. టీమిండియాతో జరిగే మ్యాచ్ చాలా కీలకమని... ఎలాంటి ఒత్తిడి, భయం లేకుండా ఆడితేనే విజయాన్ని సాధించగలమని పాక్ ఆటగాళ్లకు సూచించారు. టీ20 అంటే కేవలం సిక్సులు, ఫోర్లను బాదడమే కాదని... పక్కా ప్రణాళిక, సమయోచిత నిర్ణయాలు కూడా అవసరమని చెప్పారు. జట్టు మొత్తం బాబర్ పై ఆధారపడకూడదని... ప్రతి ఒక్క ఆటగాడు తమ వంతు పాత్రను పోషించాలని అన్నారు.