ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సాయితేజ్.. ఇది అందరినీ సంతోషపెట్టే విషయమంటూ చిరంజీవి ట్వీట్!
- ఈ రోజు జరుపుకుంటోన్న విజయదశమికి మరో ప్రత్యేకత ఉంది
- సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకుని ఇంటికి వస్తున్నాడు
- ఇది సాయితేజ్‌కు మరోజన్మలాంటిదే
- తేజుకి అత్త, పెద్దమామ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు
కాగా, ప్రజలకు చిరంజీవి దసరా శుభాకాంక్షలు తెలిపారు. 'దుష్ట శక్తులపై దుర్గామాత పోరాడి సాధించిన విజయానికి చిహ్నమైన దశమి సందర్భంగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. తల్లి దుర్గమ్మ ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలి. అంతిమంగా మంచికే గెలుపు అనే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు.