Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు అస్వస్థత... ఎయిమ్స్ కు తరలింపు

Former prime minister Manmohan Singh admitted to the AIIMS
షార్ట్స్‌లో చూడండి
మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, నీరసంతో బాధపడుతున్న మన్మోహన్ ను ఈ సాయంత్రం ఢిల్లీలోని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. మన్మోహన్ కు నిన్న జ్వరంరాగా, ఇవాళ బాగా నీరసించారు.

ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. 89 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఆరంభంలో కరోనా బారినపడ్డారు. కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా కరోనా పాజిటివ్ రావడంతో ఆయనకు ఎయిమ్స్ లోనే చికిత్స అందించారు.
Go Back to Shorts
Manmohan Singh
Illness
AIIMS
New Delhi

More Telugu News