'మా' ఎన్నికల్లో అనసూయ గెలుపోటముల ట్విస్ట్!

  • ముగిసిన మా ఎన్నికలు
  • విజేతల జాబితా విడుదల
  • అనసూయ భారీ మెజారిటీతో గెలిచినట్టు నిన్న వార్తలు
  • నేడు ఆమె పేరు జాబితాలో లేని వైనం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నటి అనసూయ కూడా పోటీ చేశారు. ఆమె ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరఫున ఈసీ మెంబర్ గా బరిలో దిగారు. అయితే భారీ మెజారిటీతో అనసూయ గెలిచినట్టు నిన్న వార్తలు వచ్చాయి. కానీ ఇవాళ 'మా' ఎన్నికల అధికారి విడుదల చేసిన జాబితాలో అనసూయ పేరు లేదు. దాంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈసీ మెంబర్లుగా 18 మంది ఎన్నిక కాగా, అందులో మంచు విష్ణు ప్యానెల్ కు చెందినవారు 10 మంది ఉండగా, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందినవారు 8 మంది ఉన్నారు. దీనిపై అనసూయ స్పందిస్తూ, రాత్రికి రాత్రి ఏం జరిగుంటుందబ్బా? అని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. అసలు, 600 పైచిలుకు ఓట్లు లెక్కించడానికి రెండ్రోజుల సమయం అవసరమా? అని సందేహం వ్యక్తం చేశారు.

Anasuya
MAA Election
EC Member
Tollywood

More Telugu News