ఒకే మొక్కకు కాసిన వంకాయ, టమాటా.. వ్యవసాయ పరిశోధన మండలి అద్భుతం
- మొక్కను అభివృద్ధి చేసిన వారణాసి కూరగాయల పరిశోధన సంస్థ
- కాశీ సందేశ్ రకం వంకాయతో, కాశీ అమన్ టమాటాతో అంటు
- 60-70 రోజుల తర్వాత కాపు
ఈ కొత్త మొక్కను 15 రోజుల నుంచి 18 రోజుల తర్వాత భూమిలో నాటి పరీక్షించారు. తొలి దశలో వంకాయ, టమాటా కొమ్మలు ఒకేలా పెరిగేలా చూసుకున్నారు. సేంద్రియ ఎరువుతోపాటు రసాయన ఎరువులు వాడారు. ఇలా పెంచిన అంటు మొక్కకు 60-70 రోజుల తర్వాత వంకాయలు, టమాటాలు కాయడం మొదలైంది. ప్రయోగాత్మక దశలో ఒక్కో మొక్కకు సగటున 2.383 కిలోల టమాటాలు, 2.684 కిలోల వంకాయలు కాసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.