లఖింపూర్ ఖేరీలో రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటన.. క్లారిటీతో ఉన్న వీడియో పోస్ట్ చేసిన వరుణ్ గాంధీ!
- ఇంతకు ముందు కూడా ఓ వీడియో వైరల్
- అందులో దృశ్యాలు సరిగ్గా కనిపించని వైనం
- రైతులకు న్యాయం చేయాలని కొత్త వీడియో పోస్ట్ చేసిన వరుణ్
ఈ వీడియో స్పష్టంగా ఉందని, హత్యల ద్వారా నిరసనకారుల గళాన్ని అణచివేయలేమని వరుణ్ గాంధీ పేర్కొనడం గమనార్హం. రైతులు చిందించిన రక్తానికి జవాబుదారీ అవసరమని ఆయన పేర్కొన్నారు. నిరసన తెలుపుతోన్న రైతుల్లో క్రూరత్వం ప్రవేశించక ముందే వారికి న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు.