ప్రభాస్ బర్త్ డే గిఫ్టుగా 'ఆదిపురుష్' నుంచి ఫస్టులుక్!

Prabhas Adi Purush Upadate
  • విడుదలకి సిద్ధమైన 'రాధే శ్యామ్' 
  • 50 శాతానికి పైగా పూర్తయిన 'సలార్'
  • షూటింగు దశలో 'ఆది పురుష్'
  • సీతాదేవి పాత్రలో కృతి సనన్  
ప్రభాస్ ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన పట్టాలెక్కించిన ప్రాజెక్టులలో 'సలార్' .. 'ఆది పురుష్' ఉన్నాయి. ఈ రెండు సినిమాలు పూర్తిగా డిఫరెంట్ జోనర్లకు చెందినవి. ఇక ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు కావడంతో, ఆయన సినిమాల నుంచి రానున్న అప్ డేట్ల కోసం అంతా ఆసక్తితో ఉన్నారు.

ముఖ్యంగా ఆ రోజున 'ఆది పురుష్' నుంచి శ్రీరాముడి గెటప్ తో ప్రభాస్ ఫస్టులుక్ రావొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చాలా వేగంగా జరుగుతోంది. రీసెంట్ గా ప్రభాస్ పాల్గొనగా కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. సీతాదేవి పాత్రలో కృతి సనన్ .. రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్న సంగతి తెలిసిందే.

ఇక ప్రభాస్ తాజా చిత్రంగా రిలీజ్ కి రెడీ అయిన 'రాధే శ్యామ్' నుంచి, చిత్రీకరణ పరంగా 50 శాతానికి పైగా పూర్తయిన 'సలార్' నుంచి కూడా ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ రావొచ్చని అంటున్నారు. 'రాధే శ్యామ్'లో కథానాయికగా పూజ హెగ్డే అలరించనుండగా, 'సలార్'లో శ్రుతి హాసన్ కనువిందు చేయనుంది.
Go Back to Shorts
Prabhas
Pooja Hegde
Sruthi Haasan

More Telugu News