ప్రారంభమైన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. నేటి నుంచి వాహన సేవలు
- అంకురార్పణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
- నేడు ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ
- 11న పట్టువస్త్రాలు సమర్పించనున్న జగన్
నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఉదయం, రాత్రి వేళ్లలో వాహన సేవలు నిర్వహిస్తారు. ఈ రోజు సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి 8.30 గంటల నుంచి గంటపాటు పెద్దశేషవాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11న రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.