ఏపీలో గత 24 గంటల్లో 671 కరోనా కేసులు

AP Covid update
  • గత 24 గంటల్లో 41,523 కరోనా టెస్టులు
  • పశ్చిమ గోదావరిలో 102 కేసులు
  • కర్నూలు జిల్లాలో 3 కేసులు
  • రాష్ట్రంలో 11 మరణాలు
  • ఇంకా 9,141 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 41,523 కరోనా పరీక్షలు నిర్వహించగా, 671 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 109 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 102 కేసులు, గుంటూరు జిల్లాలో 91, ప్రకాశం జిల్లాలో 74, కృష్ణా జిల్లాలో 66, తూర్పు గోదావరి జిల్లాలో 65 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 1,272 మంది కరోనా నుంచి కోలుకోగా, 11 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,53,863 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,30,503 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,141 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,219కి పెరిగింది.
Go Back to Shorts
Andhra Pradesh
COVID19
Update
Details
Today Cases

More Telugu News