విజయసాయిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే డ్రగ్స్ గుట్టురట్టవుతుంది: బుద్ధా వెంకన్న
- ఇటీవల గుజరాత్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
- తెరపైకి విజయవాడ పేరు
- తీవ్ర ఆరోపణలు చేస్తున్న బుద్ధా వెంకన్న
- విజయసాయి ప్రమేయం ఉందని వెల్లడి
- 'బిగ్ బాస్' కు అంతా తెలుసని వ్యాఖ్యలు
దీంట్లో ఈ రాష్ట్ర 'బిగ్ బాస్' తో పాటు విజయసాయికి కూడా భాగం ఉందని తెలిపారు. ఈ కారణంగానే విజయసాయిరెడ్డి గత పది రోజులుగా కనిపించడంలేదని బుద్ధా వెంకన్న ఆరోపించారు. విజయసాయిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే డ్రగ్స్ భాగోతం గుట్టురట్టవుతుందని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత 'బిగ్ బాస్' పై ఉందని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి డ్రగ్స్ రవాణా వ్యవహారంపై 'బిగ్ బాస్' ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.