సరదాగా పార్కుకు వెళ్లిన పాప్ సింగర్ షకీరాపై అడవి పందుల దాడి
- బార్సిలోనాలో షకీరాకు చేదు అనుభవం
- కుమారుడితో కలిసి పార్కుకు వెళ్లిన షకీరా
- షకీరా బ్యాగ్ ను లాగేసుకున్న అడవి పందులు
- లబోదిబోమన్న షకీరా
చిందరవందరగా మారిన తన బ్యాగ్ ను ఆ కొలంబియన్ పాప్ స్టార్ సోషల్ మీడియాలో అందరికీ చూపించింది. తన ఎనిమిదేళ్ల కొడుకు మిలాన్ తో బార్సిలోనా నగరంలో ఓ పార్కుకు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. ప్రఖ్యాత ఫుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్ తో షకీరా చాన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. వీరికి సాషా పిక్ మెబారక్, మిలాన్ పిక్ మెబారక్ అనే ఇద్దరు పిల్లలున్నారు.