విమాన సర్వీసులు పునరుద్ధరించండి.. భారత్ కు తాలిబన్ ప్రభుత్వ విన్నపం
- ఖతార్ సాంకేతిక సహాయాన్ని అందించింది
- కాబూల్ విమానాశ్రయాన్ని పునరుద్ధరించామని వెల్లడి
- తొలిసారి అధికారికంగా సంప్రదింపులు జరిపిన తాలిబన్ ప్రభుత్వం
'అమెరికా దళాలు ఆప్ఘనిస్థాన్ నుంచి వెళ్లే సమయంలో కాబూల్ ఎయిర్ పోర్ట్ ధ్వంసమైంది. దీంతో విమానాశ్రయంలో కార్యకలాపాలు ఆగిపోయాయి. అయితే ఖతార్ అందించిన సాంకేతిక సహాయంతో విమానాశ్రయాన్ని పునరుద్ధరించాం. భారత్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల మధ్య విమానాల రాకపోకలు జరగాలని కోరుకుంటున్నాం' అని లేఖలో తాలిబన్ ప్రభుత్వం విన్నవించింది.