కేటీఆర్... మీ ప్రభుత్వాన్ని గద్దె దింపే బ్రాండ్ అంబాసిడర్ ను నేనే!: బండి సంజయ్
- కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర
- నేటికి 32వ రోజు
- సిద్ధిపేట జిల్లాలో నేడు పాదయాత్ర
- ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు
మరో ట్వీట్ లో స్పందిస్తూ... రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లు కడితే మరో 10 లక్షల ఇళ్లయినా మంజూరు చేయించే బాధ్యత తనదని ప్రకటించారు. అవసరమైతే ఇద్దరం కలిసి ఢిల్లీ పోయి మోదీని అడుగుదామని కూడా చెప్పానని, కానీ కేసీఆర్ దాటవేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల ఊసేలేదని, వర్షాలతో పేదల ఇళ్లు కూలిపోతున్నా పట్టించుకోవడంలేదని విమర్శించారు.