దసరాకి 'భవదీయుడు భగత్ సింగ్' షూటింగ్ ప్రారంభం!
- 'గబ్బర్ సింగ్'తో లభించిన భారీ హిట్
- పవన్ తో మరోసారి సెట్స్ పైకి
- ఆల్రెడీ టైటిల్ పోస్టర్ కి అనూహ్యమైన రెస్పాన్స్
- రెండు భారీ హిట్లతో జోరు మీదున్న హరీశ్
ఈ ఇద్దరి కాంబినేషన్లో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా రూపొందనుంది. ఇటీవలే ఈ టైటిల్ ను సెట్ చేశారు. ఈ సినిమా నుంచి వచ్చిన పవన్ పోస్టర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా 'విజయదశమి' రోజున, అంటే అక్టోబర్ 15వ తేదీన లాంఛనంగా మొదలుకానుందని చెబుతున్నారు. పవన్ సరసన నాయికగా పూజ హెగ్డే ఖాయమైందీ .. లేనిది కూడా ఆ రోజున తెలుస్తుందని అంటున్నారు. 'దువ్వాడ జగన్నాథం'.. 'గద్దలకొండ గణేశ్' వంటి మెగా హీరోల హిట్ సినిమాల తరువాత హరీశ్ చేస్తున్న ఈ సినిమాపై, సహజంగానే అంచనాలు ఉన్నాయి.