ఏపీలో రోజువారీ కరోనా కేసుల వివరాలు ఇవిగో!

AP Covid Media Bulletin
  • గత 24 గంటల్లో 58,545 కరోనా పరీక్షలు
  • 1,184 మందికి పాజిటివ్
  • తూర్పు గోదావరి జిల్లాలో 218 కేసులు
  • కర్నూలు జిల్లాలో ముగ్గురికి పాజిటివ్
  • రాష్ట్రంలో 11 మంది మృతి
  • ఇంకా 13,048 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 58,545 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,184 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 218 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 165, గుంటూరు జిల్లాలో 150, నెల్లూరు జిల్లాలో 138 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 పాజిటివ్ కేసులు గుర్తించారు.

అదే సమయంలో 1,333 మంది కరోనా నుంచి కోలుకోగా, 11 మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,136కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 20,46,841 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,19,657 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 13,048 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
COVID19
Today Cases

More Telugu News