కోర్టు సీనులో మందుకొడుతూ కనిపించిన ఆర్టిస్టులు.. టీవీ కామెడీ షోపై పోలీసు కేసు!

కోర్టు సీనులో మందుకొడుతూ కనిపించిన ఆర్టిస్టులు.. టీవీ కామెడీ షోపై పోలీసు కేసు!

FIR against Kapil Sharma Show for showing actors drinking alcohol in court set
  • హిందీలో పాప్యులర్ కామెడీ షో ‘ది కపిల్ శర్మ షో’
  • ఒక ఎపిసోడ్‌లో కోర్టు సెట్‌లోనే మందుకొట్టిన నటులు
  •  తప్పుబడుతూ మధ్యప్రదేశ్‌లో కేసు వేసిన లాయర్
హిందీలో చాలా పాప్యులర్ అయిన టీవీ కార్యక్రమాల్లో ‘ది కపిల్ శర్మ షో’ ఒకటి. ఇది ఎంత పెద్ద హిట్ అంటే బాలీవుడ్ ఖాన్‌ల నుంచి హీరోలంతా తమ సినిమాల ప్రచారం కోసం ఈ షోలో పాల్గొంటారు. అలాంటి ఈ కార్యక్రమంపై ఒక లాయర్ కేసు వేశాడు. మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన ఈ లాయర్ ‘ది కపిల్ శర్మ షో’ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇటీవల ప్రదర్శించిన ఒక ఎపిసోడ్‌లో స్టేజిపై కోర్టురూమ్ సెట్ వేశారని, దానిలో నటులు బహిరంగంగానే మద్యం తాగుతూ కనిపించారని ఆ లాయర్ చెప్పారు. ఇది కోర్టును అగౌరవపరచడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఈ కార్యక్రమ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేసినట్లు సదరు లాయర్ చెప్పారు.

‘‘సోనీ టీవీలో వస్తున్న కపిల్ శర్మ షో చాలా అసంబద్ధంగా ఉంది. ఈ కార్యక్రమంలో మహిళలపై చాలా అసభ్య కామెంట్లు చేస్తారు. ఒక ఎపిసోడ్‌లో స్టేజిపై కోర్టురూమ్ సెట్ వేశారు. ఆ సెట్‌లో కొందరు నటులు బహిరంగంగానే మద్యం తాగుతూ కనిపించారు. ఇది కోర్టును అగౌరవపరచడమే. అందుకే సెక్షన్ 356/3 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశాను. ఇలాంటి అసంబద్ధతను కచ్చితంగా ఆపాల్సిందే’’ అని పిటిషన్ వేసిన న్యాయవాది చెప్పినట్లు సమాచారం.
The Kapil Sharma Show
Bollywood
Court
Madhya Pradesh

More Telugu News