హైదరాబాద్ శివారులో క‌ల‌క‌లం.. అమ్మాయి మృత‌దేహాన్ని దుప్ప‌ట్లో చుట్టి త‌ర‌లిస్తూ ప‌ట్టుబ‌డ్డ యువ‌కులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ శివారులో క‌ల‌క‌లం.. అమ్మాయి మృత‌దేహాన్ని దుప్ప‌ట్లో చుట్టి త‌ర‌లిస్తూ ప‌ట్టుబ‌డ్డ యువ‌కులు

police arrest two men in hyderabad
  • హయత్‌నగర్‌లోని బాతుల చెరువు సమీపంలో ఘ‌ట‌న‌
  • మృత‌దేహంపై దుస్తులు కూడా లేని వైనం
  • స్థానికుల‌కు పొంత‌న లేని స‌మాధానాలు చెప్పిన ఇద్దరు యువ‌కులు
  • ఇద్ద‌రు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు  
హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. బాతుల చెరువు సమీపంలో ఇద్ద‌రు యువ‌కులు ఓ యువ‌తి మృత‌దేహాన్ని తరలించ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఆ మృత‌దేహంపై దుస్తులు కూడా లేవు. ఈ విష‌యాన్ని గుర్తించిన స్థానికులు ఆ యువ‌కుల‌ను అడ్డుకుని ప్ర‌శ్నించారు.

దీంతో ఆ యువ‌కులు ఆ అమ్మాయి గురించి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో స్థానికుల‌కు మ‌రింత అనుమానం పెరిగి, ఆ ఇద్ద‌రు యువ‌కుల‌పై దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న‌ పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని, ఇద్ద‌రు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఆ యువతిని తాను ప్రేమ వివాహం చేసుకున్నాన‌ని ఇద్దరిలో ఒక యువకుడు వినోద్ పోలీసుల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు. ఆమె కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతోంద‌ని, గ‌త రాత్రి మృతి చెందింద‌ని అన్నాడు. త‌న వ‌ద్ద‌ అంత్యక్రియలకు డ‌బ్బు లేద‌ని అందుకే బయటికి తీసుకెళ్లి ఖననం చేయాలనుకున్నాన‌ని అంటున్నాడు.

ఆ యువ‌కుడు చెప్పేది నిజ‌మైతే ఆ యువ‌తి మృత‌దేహాన్ని న‌గ్నంగా ఎందుకు త‌ర‌లిస్తాడ‌ని పోలీసులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఆ యువ‌కులే అమ్మాయిని హ‌త్య చేసి, పోలీసుల‌కు దొరికిపోవ‌డంతో క‌థ‌లు చెబుతున్నార‌ని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.
Hyderabad
Police

More Telugu News