మంచు విష్ణు ప్యానెల్ పై నరేశ్ స్పందన
- విష్ణు ప్యానల్ చాలా బాగుంది
- సభ్యులెవరికీ ఎలాంటి వివాదాలు లేవు
- విష్ణు విజయం సాధించాలని కోరుకుంటున్నా
మరోవైపు విష్ణు ప్యానల్ పై నరేశ్ స్పందించారు. విష్ణు ప్యానల్ చాలా బాగుందని నరేశ్ ప్రశంసించారు. ప్యానల్ సభ్యులెవరికీ ఎలాంటి వివాదాలు లేవని చెప్పారు. అన్ని ప్రాంతాల వారికి ప్రాధాన్యతను ఇచ్చారని అన్నారు. అందరూ చదువుకున్నవారేనని చెప్పారు. యువకులు, అనుభవజ్ఞులను ఎంపిక చేశారని చెప్పారు. మహిళలకు కూడా ప్రాధాన్యతను ఇచ్చారని అన్నారు. విష్ణు విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పారు.