ఇంకోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే సంగతి చూస్తాం: టీఆర్ఎస్ శ్రేణులకు సీపీఐ నారాయణ వార్నింగ్
- రేవంత్ రెడ్డి ఇంటిపై దాడికి యత్నించిన టీఆర్ఎస్ శ్రేణులు
- ఇది నీచమైన సంస్కృతి అన్న సీపీఐ నారాయణ
- దమ్ముంటే డైరెక్ట్ గా రావాలని సవాల్
మరోవైపు రేవంత్ ఇంటిపై దాడిని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. అసలైన డెకాయిట్లు అందరూ టీఆర్ఎస్ లోనే ఉన్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాయకుల ఇళ్లపై దాడులు చేయడం నీచ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. రేవంత్ ఇంటిపై దాడిని అఖిలపక్షం ఖండిస్తోందని చెప్పారు. ఇంకోసారి ఇలాంటి దాడులకు తెగబడితే సంగతి చూస్తామని హెచ్చరించారు. దమ్ముంటే డైరెక్ట్ గా రావాలని సవాల్ విసిరారు. ఇలాంటి దాడులు చేసే వారిని రాజకీయ పార్టీలు ప్రోత్సహించకూడదని చెప్పారు.