Charan: చరణ్ ఫైట్ కోసం 10 కోట్ల బడ్జెట్ వేసిన శంకర్!

Big action episode in shankar and  Charan movie
షార్ట్స్‌లో చూడండి
శంకర్ .. చరణ్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కోసం 200 కోట్ల రూపాయలను కేటాయించినట్టుగా తెలుస్తోంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా సాగే ఈ కథను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు.

ప్రభుత్వ ఉద్యోగిగా చరణ్ కనిపించే ఈ సినిమాలో రన్నింగ్ ట్రైన్ లో సాగే ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉందట. చరణ్ .. వందమంది ఫైటర్లు ఈ యాక్షన్ ఎపిసోడ్ లో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్ కోసం 10 కోట్లు కేటాయించినట్టుగా చెప్పుకుంటున్నారు. అంటే ఏ రేంజ్ లో చిత్రీకరించనున్నారనేది అర్థం చేసుకోవచ్చును.

సహజంగానే శంకర్ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఆయన గత చిత్రాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఈ సినిమాలో మరింత కొత్తగా యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేయించినట్టుగా చెబుతున్నారు. కియారా అద్వాని కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. .
Go Back to Shorts
Charan
Kiara Advani
Srikanth
Sunil
Anjali

More Telugu News