కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిమజ్జనం: తలసాని
- ఏర్పాట్లను పరిశీలించిన తలసాని
- అన్ని శాఖల అధికారులతో సమన్వయం
- వీలైనంత త్వరగా నిమజ్జనం ముగిసేలా చర్యలు
మరోవైపు, డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... గణేశ్ నిమజ్జనం సందర్భంగా అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పని చేస్తున్నామని చెప్పారు. ప్రధాన ప్రాంతాల్లో ఉన్నతస్థాయి అధికారులతో పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. పోలీసు స్టేషన్లకు సీసీటీవీ కెమెరాలు అనుసంధానం చేశామని చెప్పారు. వీలైనంత త్వరగా నిమజ్జనం ముగిసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 10 అడుగులలోపు ఎత్తు ఉన్న విగ్రహాలను ఎన్టీఆర్, పీవీ మార్గ్ వైపు నుంచి ట్యాంక్స్ బండ్‌కు తరలిస్తున్నామని తెలిపారు.