కొత్త దర్శకుడికి సమంత గ్రీన్ సిగ్నల్!
- లేడీ ఓరియెంటెడ్ కథలవైపు మొగ్గు
- షూటింగును పూర్తిచేసుకున్న 'శాకుంతలం'
- శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై సినిమా
- త్వరలో పూర్తి వివరాలు
'శాకుంతలం' కథ అంతా కూడా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందనే విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత సమంత బాలీవుడ్ సినిమాలు చేయనున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. కానీ ఆమె ఓ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ తాజాగా వినిపిస్తోంది.
ఒక కొత్త దర్శకుడు ఆమెకు ఒక కథ వినిపించగా, కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో వెంటనే అంగీకరించిందని అంటున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.