హరీశ్ రావు తోలుబొమ్మలా ఆడుతున్నారు: జితేందర్ రెడ్డి
- ఏడేళ్లుగా అబద్ధాలు చెపుతూ టీఆర్ఎస్ గెలుస్తోంది
- దత్త గ్రామాన్ని కూడా హరీశ్ రావు అభివృద్ధి చేయలేదు
- లక్ష ఓట్ల మెజార్టీతో ఈటల గెలుస్తారు
దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోయిందని... అప్పటి నుంచి ప్రభుత్వం ఆ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని జితేందర్ రెడ్డి మండిపడ్డారు. ఓడిన చోట కేసీఆర్ ప్రభుత్వం పని చేయదా? అని ప్రశ్నించారు. హరీశ్ రావు దత్తత తీసుకున్న కొల్గుర్ గ్రామంలోనే 60 ఇళ్లను నిర్మించలేకపోయారని... ఇక హుజూరాబాద్ ను ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గం సిద్ధిపేటలో రుణమాఫీ, డబుల్ బెడ్రూమ్ ల నిర్మాణం, దళితబంధులను హరీశ్ చేయలేకపోయారని విమర్శించారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.