పాఠ్యపుస్తకాల్లో కూడా మత ప్రచారానికి పూనుకున్నారా?: జగన్ పై సోము వీర్రాజు ఫైర్
- చిన్నారుల మెదళ్లలో కూడా మతాన్ని చొప్పిస్తున్నారా?
- మీ మత వ్యాప్తికి హద్దులు లేవా?
- మత ప్రచారాలను వెంటనే పాఠ్యపుస్తకాల నుంచి తొలగించండి
చిన్నారుల మెదళ్లలో కూడా మీ మతాన్ని చొప్పించడానికి... వారి పాఠ్యపుస్తకాలలో సైతం మత ప్రచారానికి పూనుకున్నారా జగన్ గారూ? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మత వ్యాప్తికి హద్దులు లేవా? అని ప్రశ్నించారు. ఇలాంటి మత ప్రచారాలను వెంటనే చిన్నారుల పాఠ్యపుస్తకాల నుంచి తొలగించండి. లేదంటే బీజేపీ నుంచి పత్రిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.