బాలయ్య న్యూ మూవీ టైటిల్ 'రౌడీయిజం'?
- త్వరలో 'అఖండ' షూటింగు పూర్తి
- నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేనితో
- వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్
- తెరపైకి త్రిష .. ఇలియానా పేర్లు
గోపీచంద్ మలినేని 'క్రాక్' తరహాలోనే ఈ సినిమాను భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం తాజాగా 'రౌడీయిజం' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం త్రిష - ఇలియానాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుందని అంటున్నారు.