హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనంపై ఉత్కంఠ... సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ సర్కారు
- హుస్సేన్ సాగర్ లో విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు
- రివ్యూ పిటిషన్ వేసిన తెలంగాణ ప్రభుత్వం
- తోసిపుచ్చిన ధర్మాసనం
- హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంలో సర్కారు పిటిషన్
అయితే, హైకోర్టు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. దాంతో రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసింది. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.