అమిత్ షా సమక్షంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం
- ఇటీవల సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా
- కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్
- ఆమోదం తెలిపిన బీజేపీ శాసనసభాపక్షం
- పటేల్ తో ప్రమాణస్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నర్
ఇటీవల సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేయడంతో గుజరాత్ బీజేపీ శాసనసభాపక్షం భూపేంద్ర పటేల్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. బీజేపీ అధినాయకత్వం ఆశీస్సులు కూడా తోడవడంతో భూపేంద్ర పటేల్ కు ఎలాంటి వ్యతిరేకత ఎదురుకాలేదు. భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.