గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ఎంపిక
- సీఎం పదవికి రాజీనామా చేసిన విజయ్ రూపానీ
- గుజరాత్ కొత్త సీఎం కోసం బీజేపీ కసరత్తులు
- రాష్ట్రానికి బీజేపీ పరిశీలకుల రాక
- భూపేంద్ర పటేల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు
ఈ సమావేశంలో బీజేపీ హైకమాండ్ పరిశీలకులుగా కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. భూపేంద్ర పటేల్ ను బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేల అభీష్టాన్ని గౌరవిస్తున్నట్టు పరిశీలకుల హోదాలో హాజరైన తోమర్, జోషి పేర్కొన్నారు. ఈ సమావేశానికి విజయ్ రూపానీ, కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా హాజరయ్యారు.