తెలంగాణలో కొత్తగా 220 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 51,004 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 71 మందికి పాజిటివ్
- పలు జిల్లాల్లో కొత్త కేసులు నిల్
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 5,351 మందికి చికిత్స
అదే సమయంలో 338 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,61,006 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,51,763 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,351 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,892కి పెరిగింది.
