తిరుమల భక్తులకు శుభవార్త.. ప్రారంభమైన సర్వదర్శన టోకెన్ల జారీ
- కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 12 నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత
- కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి పునరుద్ధరణ
- తొలి విడతగా చిత్తూరు జిల్లా భక్తులకు రోజుకు 2 వేల చొప్పున పంపిణీ
ఇందులో భాగంగా తొలి విడతగా చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులకు రోజుకు 2 వేల చొప్పున టోకెన్లు పంపిణీ చేస్తోంది. తిరుమలలోని శ్రీనివాసం యాత్రికుల వసతిగృహ సముదాయంలో నిన్న ఉదయం ఆరు గంటలకు టోకెన్ల జారీ ప్రారంభం కాగా ఉదయం పది గంటల కంటే ముందే పూర్తయింది. రోజు వారీ టోకెన్లను ఏ రోజుకారోజే అందించనున్నారు. టీటీడీ తాజా నిర్ణయంపై సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.