చైనా నుంచి తాలిబన్లకు అందుతున్న నిధులపై జో బైడెన్ స్పందన
- తాలిబన్లతో చైనాకే అసలైన సమస్య ఉంటుంది
- ఈ నేపథ్యంలోనే దాని పరిష్కారం కోసం చైనా ప్రయత్నాలు
- పాకిస్థాన్, రష్యా, ఇరాన్ కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నాయి
ఈ నేపథ్యంలో దాని పరిష్కారం కోసం చైనా పలు ఏర్పాట్లు చేసుకుంటోందని బైడెన్ తెలిపారు. పాకిస్థాన్, రష్యా, ఇరాన్ కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఇప్పుడు చైనా కూడా ఈ ప్రయత్నాలు చేస్తోందని, తాలిబన్ల విషయంలో ఇప్పుడేం చేయాలా? అని ఆయా దేశాలు ఆలోచించుకుంటున్నాయని చెప్పారు.
ఆఫ్ఘన్‌కు చేసే సాయాన్ని అమెరికా ఇప్పటికే నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా, రష్యా వంటి దేశాలు తాలిబన్లకు నిధులు పంపుతాయని, ఆఫ్ఘన్‌లో నెలకొంటోన్న ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాలిబన్లతో చైనా చర్చలు జరుపుతోంది. ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పాలనను గుర్తించేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.