టీఆర్ఎస్ ను వీడుతున్నారన్న వార్తలపై స్పందించిన తుమ్మల నాగేశ్వరరావు
- పార్టీ మారడం లేదని స్పష్టీకరణ
- సీఎం కేసీఆర్ తోనే ప్రయాణమని వెల్లడి
- నీతికి కట్టుబడి ఉన్నానని కామెంట్
తాను పార్టీ మారడం లేదని, ఆ ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేశారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. సీఎం కేసీఆర్ తోనే తన రాజకీయ ప్రయాణమని తెలిపారు. రాజకీయాల్లో తాను నీతి, నిజాయతీకి కట్టుబడి ఉన్నానన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని, సీఎం కేసీఆర్ భారీగా నిధులను ఖర్చు చేశారని ఆయన చెప్పారు.