ఓటీటీలో విడుదలయ్యే సినిమాలను థియేటర్లలో విడుదల చేయం: థియేటర్ల యజమానుల సంఘం
- ఓటీటీలో విడుదలైతే థియేటర్లకు ప్రేక్షకులు తగ్గిపోతారంటున్న ఎగ్జిబిటర్లు
- దీనివల్ల నష్టం వాటిల్లుతుందని వ్యాఖ్య
- సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని డిమాండ్
ఈ నేపథ్యంలో థియేటర్ల యజమానుల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. ఓటీటీలో ప్రదర్శించే చిత్రాలను థియేటర్లలో విడుదల చేయడానికి తాము అంగీకరించే ప్రసక్తే లేదని ప్రకటనలో స్పష్టం చేసింది. థియేటర్లలో విడుదల చేసే కొత్త సినిమాలను నాలుగు వారాలు గడిచిన మీదటే ఓటీటీలో ప్రదర్శించేందుకు అనుమతించాలని పేర్కొంది.