పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన సినీ నటుడు కృష్ణుడు
- వినాయకుడు, ఏం మాయ చేశావే వంటి హిట్ సినిమాల్లో నటించిన కృష్ణుడు
- ఆయనతో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల
- ఈ రోజు సాయంత్రం విచారణకు పిలుపు
దీంతో ఆయనతో పాటు మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మియాపూర్‌లోని శిల్పా పార్కులో పెద్దిరాజు అనే వ్యక్తితో కలిసి కృష్ణుడు పేకాట నిర్వహిస్తున్నాడని తెలుస్తోంది. వారందరినీ మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, వ్యక్తిగత పూచీకత్తుపై పోలీసులు విడిచిపెట్టారు. ఈ రోజు సాయంత్రం విచారణకు రావాలని ఆదేశించారు.