ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు!

AP assembly monsoon session dates finalised
  • ఈ నెల 21 లేదంటే 22 తేదీల్లో ప్రారంభం
  • ఐదారు రోజులు నిర్వహించి మళ్లీ డిసెంబరులో నిర్వహించాలని నిర్ణయం
  • 11 ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకున్న తర్వాత మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ నెల 21 లేదంటే 22 తేదీల్లో ప్రారంభించి ఐదారు రోజులు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే, డిసెంబరులో మరోమారు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒకేసారి ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించడం కంటే ఇదే మేలని భావిస్తున్నారు. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇక శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ల ఎన్నికలను అసెంబ్లీ సమావేశాల సమయంలోనే నిర్వహించాలని గతంలో నిర్ణయించగా, ఇప్పుడీ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఎందుకంటే, ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి కనుక ఎన్నికలు జరిగితే దాదాపు అన్ని స్థానాలను తాము దక్కించుకునే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది. ఈ స్థానాలను గెలుచుకున్న తర్వాత శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.
Go Back to Shorts
Andhra Pradesh
Andhra Pradesh Assembly
AP Legislative Council

More Telugu News