ఏపీలో మరో 1,520 కొవిడ్ పాజిటివ్ కేసులు

AP Covid details
  • గత 24 గంటల్లో 64,739 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 263 కేసులు
  • కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 6 కేసులు
  • రాష్ట్రంలో 10 మంది మృతి
  • ఇంకా 14,922 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 64,739 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,520 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 263 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 188, నెల్లూరు జిల్లాలో 186, పశ్చిమ గోదావరి జిల్లాలో 171, గుంటూరు జిల్లాలో 162 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 6 కొత్త కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 1,290 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,887కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,18,200 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,89,391 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా 14,922 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Details
New Cases
Deaths

More Telugu News