ఏపీలో మరో 1,378 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 59,566 కరోనా పరీక్షలు
- తూర్పుగోదావరి జిల్లాలో 242 కేసులు
- విజయనగరం జిల్లాలో 13 కేసులు
- రాష్ట్రంలో 10 మంది మృతి
అదే సమయంలో 1,139 మంది కరోనా నుంచి కోలుకోగా, 10 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,16,680 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 19,88,101 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 14,702 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 13,877కి పెరిగింది.