రైతుల తలలు పగలగొట్టాలంటూ ఆదేశాలిచ్చిన హర్యానా అధికారిపై బదిలీ వేటు
- ఇటీవల హర్యానాలో రైతుల ఆందోళన
- రైతులపై పోలీసుల లాఠీచార్జి
- గాయాలపాలైన రైతులు
- సదరు అధికారిపై తీవ్ర విమర్శలు
తాజాగా, హర్యానాలో 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా, వారిలో ఆయుష్ సిన్హా కూడా ఉన్నారు. సిన్హాను సిటిజెన్ రీసోర్సెస్ ఇన్ఫర్మేషన్ విభాగం అదనపు కార్యదర్శిగా నియమించారు. సిన్హా 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. కాగా, ఆయుష్ సిన్హా తన విధి నిర్వహణలో సరిగానే వ్యవహరించినా, ఆదేశాలు ఇచ్చే సమయంలో ఆయన ఎంచుకున్న మాటలు అభ్యంతరకరం అని సీఎం ఖత్తర్ అభిప్రాయపడ్డారు.