విశాఖ చమురు శుద్ధి కర్మాగారంలో గ్యాస్ లీకేజి కలకలం

Gas leak at HPCL Refinery in Visakhapatnam
  • హెచ్ పీసీఎల్ రిఫైనరీలో గ్యాస్ లీక్
  • వెంటనే మోగిన సైరన్
  • పరుగులు తీసిన కార్మికులు
  • గ్యాస్ లీకేజిని అరికట్టిన అధికారులు
విశాఖలో మరోసారి కలకలం రేగింది. ఇక్కడి హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పీసీఎల్)కు చెందిన చమురు శుద్ధి కర్మాగారంలో గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీక్ అయిన వెంటనే రిఫైనరీలో ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. సైరన్ మోగడంతో కార్మికులు ప్లాంట్ నుంచి బయటికి పరుగులు తీశారు. గ్యాస్ లీకేజిని గుర్తించిన అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని హెచ్ పీసీఎల్ అధికారులు తెలిపారు. చమురు శుద్ధి పనులు మళ్లీ కొనసాగుతున్నట్టు వెల్లడించారు.
Go Back to Shorts
Gas Leak
HPCL
Refinery
Vizag

More Telugu News