తెలంగాణలో తాజాగా 338 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 74,207 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 84 కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 5,864 మందికి చికిత్స
అదే సమయంలో 364 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,58,054 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,48,317 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,864 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,873కి పెరిగింది.
