మూడో రోజుకు చేరిన బండి సంజయ్ పాదయాత్ర... ఈనాటి రోడ్ మ్యాప్ ఇదే!
- మొన్న చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద పాదయాత్ర ప్రారంభం
- నిన్న గోల్కొండ మీదుగా కొనసాగిన యాత్ర
- ఈరోజు హిమాయత్ నగర్ వరకు కొనసాగనున్న పాదయాత్ర
ఈనాటి పాదయాత్ర తిప్పుఖాన్ బ్రిడ్జి, లంగర్ హౌస్ మీదుగా ఆరే మైసమ్మ గుడి వద్దకు చేరుకుంటుంది. అక్కడ సభను నిర్వహించిన తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత అజీజ్ నగర్ మీదుగా హిమాయత్ నగర్ వరకు సాగుతుంది. రాత్రి బండి సంజయ్ హిమాయత్ నగర్ లో బస చేస్తారు. రాత్రి 9.30 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఈరోజు మొత్తం 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది.