తెలంగాణలో మరో 325 మందికి కరోనా పాజిటివ్
- తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- గత 24 గంటల్లో 78,787 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 80 కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 6,065 మందికి చికిత్స
అదే సమయంలో 424 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,57,119 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,47,185 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,065 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,869కి పెరిగింది.
