మైసూరు గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురి అరెస్ట్.. ఇంకా షాక్ లోనే ఉన్న బాధితురాలు
- మంగళవారం మైసూరులో జరిగిన గ్యాంగ్ రేప్
- మైసూరు యూనివర్శిటీలో ఎంబీఏ చదువుతున్న బాధితురాలు
- ఆరో నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపిన డీజీపీ
ఘటన వివరాల్లోకి వెళ్తే... మహారాష్ట్రకు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని మైసూరు యూనివర్శిటీలో ఎంబీఏ చదువుతోంది. మంగళవారం సాయంత్రం మైసూరు శివార్లలో ఉన్న టూరిస్ట్ స్పాట్ చాముండి హిల్స్ కు తన స్నేహితుడితో కలిసి వెళ్లింది. ఆ సమయంలో నిందితులంతా ఆ ప్రాంతంలో మందు తాగుతూ ఉన్నారు. అడవిలోకి వెళ్తున్న వారిద్దరినీ అనుసరించారు.
అనంతరం వారిని ఆపి, డబ్బు ఇవ్వమని డిమాండ్ చేశారు. వారు నిరాకరించడంతో ఆమె స్నేహితుడిని వారు చితకబాదారు. నిందితులలో ఇద్దరు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఆమె కూడా తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బాధితురాలు ఇంకా షాక్ లోనే ఉండటంతో ఆమె స్టేట్మెంట్ ను నమోదు చేయలేదని డీజీపీ తెలిపారు.