హెడింగ్లే టెస్టు: నాలుగో రోజు ఆట ఆరంభంలోనే పుజారా వికెట్ కోల్పోయిన భారత్
- హెడింగ్లేలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
- 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పుజారా అవుట్
- రాబిన్సన్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూ
- క్రీజులో కోహ్లీ, రహానే
ఇక ప్రస్తుతం భారత్ స్కోరు 86 ఓవర్లలో 3 వికెట్లకు 224 పరుగులు కాగా, ఇంకా 130 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (46 బ్యాటింగ్), అజింక్యా రహానే (5 బ్యాటింగ్) ఉన్నారు.
ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 78 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ అందుకు బదులుగా 432 పరుగులు చేసింది. తద్వారా కీలకమైన 354 పరుగుల ఆధిక్యం అందుకుంది.