missing: హైద‌రాబాద్‌లో బాలుడి అదృశ్యం.. గాలిస్తోన్న పోలీసులు

  • రాజేంద్రనగర్‌లో ఘ‌ట‌న‌
  • నిన్న సాయంత్రం నుంచి ల‌భ్యం కాని బాలుడి ఆచూకీ
  • ఇంటి ఆవరణలో ఆడుకుంటూ క‌న‌ప‌డ‌కుండాపోయిన వైనం
boy goes missing in hyderabad

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఓ చిన్నారి అదృశ్యం కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. నిన్న సాయంత్రం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు క‌న‌ప‌డ‌కుండా పోవ‌డంతో ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. త‌మ కుమారుడి కోసం తల్లిదండ్రులు అబ్దుల్‌ రహీమ్‌, తబుసుమ్ వెతికిన‌ప్ప‌టికీ క‌న‌ప‌డ‌కపోవ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆ బాలుడి ఇంటి వ‌ద్ద‌కు పోలీసులు చేరుకుని అక్క‌డి ప‌రిస‌రాల‌ను పరిశీలించారు. బాలుడిది మిస్సింగ్ కేసుగా నమోదు చేశామ‌ని వివ‌రించారు. బాలుడి కోసం గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.

More Telugu News