తాలిబన్లపై సమరశంఖం పూరించిన పంజ్ షీర్ యోధులు
- తాలిబన్లకు లొంగని పంజ్ షీర్ లోయ
- యుద్ధానికి సిద్ధమంటున్న పంజ్ షీర్ సాయుధులు
- మద్దతు పలుకుతున్న ఆఫ్ఘన్ ప్రజలు, తజకిస్థాన్
- గతంలో అనేక పోరాటాల్లో పంజ్ షీర్ యోధులదే పైచేయి
తాజాగా తమపై తాలిబన్లు దురాక్రమణకు యత్నిస్తే తగిన బుద్ధి చెబుతామని పంజ్ షీర్ యోధులు స్పష్టం చేస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాలిబన్లకు లొంగేదిలేదని ఉద్ఘాటిస్తున్నారు. ఇప్పటికే తాలిబన్ వ్యతిరేక నార్తర్న్ అలయెన్స్ కూడా పంజ్ షీర్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ప్రస్తుతం పంజ్ షీర్ లోయలోనే ఉన్నారు.
తాలిబన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇతర ప్రావిన్స్ ల్లోని ప్రజలు కూడా పంజ్ షీర్ సాయుధులకు మద్దతు పలుకుతున్నారు. ఆఫ్ఘన్ తో సరిహద్దులు పంచుకుంటున్న తజకిస్థాన్ కూడా పంజ్ షీర్ యోధులకు సంఘీభావం తెలిపింది.