Jr NTR: కొమరం భీమ్ ను వందమంది ఆంగ్లేయ సైనికులు చుట్టుముట్టిన సీన్ హైలైట్ అట!

Ntr scene is highlighted in RRR movie
షార్ట్స్‌లో చూడండి
కథానాయకులకు విప్లవ వీరుల పాత్రలను పోషించే అవకాశం చాలా తక్కువగా వస్తుంటుంది. అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వారు తమవంతు కృషి చేస్తుంటారు. అలా ఎన్టీఆర్ కి 'ఆర్ఆర్ఆర్' సినిమాలో 'కొమరం భీమ్' పాత్రను పోషించే అవకాశం లభించింది. ఈ పాత్రలో ఆయన ఇమిడిపోయాడని సన్నిహితులు చెబుతున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ వెర్షన్ కి సంబంధించి డిజైన్ చేసిన ఒక యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. కొమరం ఆంగ్లేయులపై తనదైన తరహాలో పోరాట శంఖం పూరిస్తాడు. దాంతో ఒకానొక కీలకమైన సమయంలో ఆయనను వందమంది ఆంగ్లేయ సైనికులు చుట్టుముడతారట.

అప్పుడు చోటుచేసుకునే యాక్షన్ సీన్ ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. మూడువారాల పాటు ఈ యాక్షన్ సీన్ ను చిత్రీకరించారట. ఎమోషన్ తో కూడిన ఈ యాక్షన్ సీన్ కి థియేటర్లలో విజిల్స్ వర్షం కురుస్తుందని చెబుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో, బాలీవుడ్ .. హాలీవుడ్ ఆర్టిస్టులు నటిస్తుండటం విశేషం.
Go Back to Shorts
Jr NTR
Charan
Alia Bhatt

More Telugu News