Funeral: పతీసహగమనం.. భార్య మృతిని తట్టుకోలేక ఆమె చితిమంటల్లోకే దూకి భర్త ఆత్మహత్య!

65 year old man ends life by jumping into wifes funeral pyre
  • గుండెపోటుతో భార్య మృతి 
  • వెనక్కి పరిగెత్తుకొచ్చి భార్య చితిమంటల్లో దూకిన భర్త  
  • అందరూ చూస్తుండగానే సజీవ దహనం
  • ఒడిశాలోని కలహండి జిల్లాలో ఘటన
భార్య మృతిని తట్టుకోలేని ఓ భర్త ఆమె చితిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశాలోని కలహండి జిల్లా గోలముండా సమితిలోని శైలుజోడి గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన రాయబారి (60), నీలమణి శబర (65) భార్యాభర్తలు. వీరికి నలుగురు కుమారులు. రాయబారి మంగళవారం గుండెపోటుతో మృతి చెందింది.  

అంత్యక్రియల కోసం మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ చితిపేర్చి మృతదేహానికి నిప్పు అంటించారు. అనంతరం అందరూ ఇళ్లకు బయలుదేరారు. అందరితోపాటే ఇంటికి బయలుదేరిన నీలమణి ఆ తర్వాత ఒక్కఉదుటున వెనక్కి పరిగెత్తుకొచ్చి భార్య చితిమంటల్లో దూకాడు. అందరూ చూస్తుండగానే అతడు భార్యతో సహా దహనమయ్యాడు.
Funeral
Odisha
Husband
Suicide

More Telugu News