స్మార్ట్‌ఫోన్‌లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. అలాస్కా విమానం అత్యవసర ల్యాండింగ్

Passengers Injured as Smoke Fills Cabin of Alaska Airlines Flight
  • 128 మందితో న్యూ ఓర్లీన్స్ నుంచి సీటెల్ వెళ్తున్న విమానం
  • సీటెల్-టకోమా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
  • కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు
128 మంది ప్రయాణికులతో న్యూ ఓర్లీన్స్ నుంచి సీటెల్‌ వెళ్తున్న అలాస్కా 751 విమానంలోని ఓ ప్రయాణికుడి సెల్‌ఫోన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సెల్‌ఫోన్‌లో మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది వాటిని అదుపు చేశారు. అనంతరం విమానాన్ని సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. విమానంలోని 128 మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బస్సులో తరలించారు. మంటలు చెలరేగిన స్మార్ట్‌ఫోన్ పూర్తిగా దగ్ధమైంది.
Go Back to Shorts
Alaska Airlines
Flight
Smart Phone
Fire

More Telugu News